హ్యారీ పోటరు బుక్కులు

ఎప్పుడొ పది సంవత్సరాల క్రితం రాయటం మొదలు పెట్టింది, J.K.Rowling, ఈ పుస్తాకాలను. అప్పటి నుండి తరువాతి పుస్తకం ఎప్పుడెప్పుడు వస్తుందా అని, ప్రతీ పుస్తకం తరువాత అందరూ ఎదురు చూడటం మొదలు పెట్టారు. ఆ విధంగా ఆఖరు పుస్తాకాన్ని విడుదల చేయటానికి ముహూర్తం కూడా నిర్ణయించేసారు. కవరు పేజీలలో ఉండే బొమ్మలను అప్పుడే విడుదల కూడా చేసేసారు. కధముగింపులో ఏ పదముంటుందో కూడా చెప్పేసారు. అంతేకాదు పుస్తకం వెనుక అట్టపై ఉండే కధ గురించి వాఖ్యాలు కూడా విడుదల చేసేశారు. ఆఖరుకి పుస్తకంలో ఎన్ని పేజీలుంటాయో కూడా చెప్పేసారు.

ఇవన్నీ చూసి/విన్న తరువాత పుస్తకం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూడటం మొదలు పెట్టాను. ఈ టపా రాసే సమయానికి ఇంకా 74 రోజుల 5 గంటల 15 నిమిషాలు దూరంలో ఉంది పుస్తకం విడుదల చేసే సమయం.

అయితే ఈ లోగా ఇలా వేచి చూడలేని కొంతమంది, వాళ్ళకు వాళ్ళే సొంతంగా ఏడవ పుస్తకాన్ని రాసేసుకున్నారు. ఇంకొంతమందేమో ఏడవ పుస్తకంలో ఏముంటుందో అని ఊహించేసి పుంఖాను పుంఖాలుగా పుస్తకాలు రాసేసి అమ్మేసుకుంటున్నారు మరి. ఏదయితేనేం ఈ కొసరు కధలను కూడా అసలు కధకు మల్లేనే ఉత్కంటతతో నడుపుతున్నారు, మెయిన్ కోర్సుకు ముందు స్టార్టర్ల లాగా.

ఇవన్నీ కాక ఈమధ్య ఏడవ పుస్తకంలో కొంతబాగం అప్పుడే లీకయినట్లు వార్తలు వినపడుతున్నాయి. ఇదెంతవరకూ నిజమో మరి. ఏదేమయినా ఆ ఏడవ పుస్తకం కోసం ఇంకా రెండునర్ర నెలలు వేచి చూడాల్సిందే…

పని లేని మంగలోడు పిల్లి తల గొరిగాడంట!

mspaintని మనం అసలు వాడతామో లేదా తెలియదు కానీ, ఈ క్రింది వీడియో చూస్తే దానిలో కూడా మంచి మంచి బొమ్మలు గీయొచ్చేమో అని అనిపించక మానదు.

వీడియో చూడటానికి బొమ్మ మీద నొక్కండి. ఇక్కడ కూడా చూడొచ్చు.

స్నేహితులు పంపిన ఈ వీడియోని చూసి ఊరుకుంటే సరిపోయేది. ఏ క్షణాన చూసానో నాకు కూడా ఉత్సాహం వచ్చేసింది. ఇంకే ఆరు గంటల పాటు పాటుపడి ఈ బొమ్మ క్రింది గీసాను.

అలా ఆరు గంటల పాటు గీసిన తరువాత అర్థమయింది, నేను ఆ సమయాన్నంతా వృధాచేసానని. కాకపోతే ఒక విషయం తెలిసింది, mspaintలో బొమ్మలు గీయటం పెన్సిలు చెక్కటానికి గొడ్డలి వాడటంలాంటిదే అని. ఇంకో వీడియోని చూసిన తరువాత అర్ధమయ్యింది, ప్రోగ్రాములను రాయటానికి assembly, C, javaలు ఉన్నట్లు బొమ్మలను గీయటానికి కూడా mspaint, photoshop లాంటి సాఫ్టువేర్లు ఉంటాయని.

ఇది మీరు నమ్మాలి

దాదాపు 7,50,00,000 సంవత్సరాలకు పూర్వం జరిగిన కధ ఇది. 26 నక్షత్రాలు వాటిలో ఉన్న 76 గ్రహాలను, తీగీయాక్ అనే రాజ్యాన్ని, జిను అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. అందులో మన భూగ్రహం కూడా ఉంది. కొంత కాలానికి అన్ని గ్రహాలలో జనాభా బాగా పెరిగి పోయింది. ఒక్కొక్క గ్రహంలో సుమారు 17800 కోట్ల జనాభాతో గ్రహాలు మరీ భారీగా తయారయ్యాయి. అప్పట్లో ప్రజల నాగరీకత అచ్చం మన నాగరికత లాగానే వర్ధిల్లుతుంది. మనమేసుకునే బట్టలనే వేసుకునే వాళ్ళు. మనం ఉపయోగించినట్లే రైళ్ళు, కార్లు, బస్సులు లాంటి వాహనాలను కూడా ఉపయోగించేవాళ్ళు.

మరి కొన్నాళ్ళకు జెను అధికారం కోల్పోయే సమయం ఆసన్నమయ్యింది, అప్పుడు తను అధికారం చలాయిస్తున్న అన్ని గ్రహాలలో ఉన్న అధిక జనాభాను నిర్మూలించాలని అనుకున్నాడు. సైకియాట్రిస్టుల సాయంతో కోత్ల మంది ప్రజలను మత్తు మందు ఇచ్చి నిర్వీర్యులను చేసాడు, వీరందరినీ ఆదాయపు పన్ను పరిశీలన అనే ముసుగులో పిలిచి, వారిని అక్కడ నుండి అపహరించి వారందరినీ చంపేయటానికి భూగ్రహానికి తరలించాడు. అలా భూగ్రహానికి తరలించిన జనాలందరినీ ఇక్కడ ఉన్న అగ్ని పర్వతాల చుట్టూ పేర్చాడు. ఈ అగ్ని పర్వతాలను హైడ్రోజను బాంబులతో నింపి, వాటన్నిటినీ ఒకే సారి పేలుస్తాడు. దాంతో ఇక్కడకు తరలించిన ప్రజలందరూ చనిపోతారు. ఏవో కొందరివి శరీరాలు వాత్రం మిగులుతాయి.

శరీరాలు లేని ఈ ఆత్మలన్నీ ఆ వ్స్పోటనానికి చల్లాచదురై గాలిలో అలా తేలుతూ ఉంటాయి. జెను సైనికులు వాటన్నిటినీ ఒక ఎలక్ట్రానిక్ రిబ్బను ఉపయోగించి బంధిస్తారు. అలా బంధించిన ఆత్మలను భూమి చుట్టూ ఉన్న సూన్యంలోకి పీల్చేస్తారు. వేల కోట్ల సంఖ్యలో బంధించిన ఈ ఆత్మలకు ఒక 3-D సినిమాను 36 రోజులపాటు చూపిస్తారు. అలా 36 రోజుల పాటు సినిమాను చూసిన ఆత్మలు తమ అస్తిత్వాన్ని మరిచి పోతాయి, లేనివాటిని ఉన్నవాటిగా భ్రమిస్తాయి, సినిమాలో చూసినదే నిజమయిన ప్రపంచంగా భావించటం మొదలుపెడతాయి. ఇలా కొత్త కొత్త నమ్మకాలతో ఉన్న ఈ ఆత్మలను విడిచి పెట్టేసిన తరువాత అవి గుంపులు పుంపులుగా ఏర్పడతాయి. సినిమా ప్రభావం వలన అవి తమ మధ్యన ఉన్న తేడాను కూడా గుర్తించలేవు. అలా ప్రతీ గుంపూ, పేలుడు తరువాత మిగిలిపోయిన శరీరాలలోకి వెల్లిపోతాయి. ఒక్కొక్క గుంపుకు ఒక్కో శరీరం ల్కభిస్తుంది. ప్రతీ గుంపులో వేలకొద్దీ ఆత్మలు ఉంటాయి.

ఇది జరిగిన కధ, ఈ ఆత్మలు ఇప్పుడు కూడా చాలా మంది శరీరాలను అంటిపెట్టుకుని ఉన్నాయంట. అలా అంతిపెట్టుకుని అందరినీ బాధిస్తున్నాయంట, అంతే కాదు మీకు కలిగే చాలా సందిగ్ధాలకు కారణం కూడా ఈ పిచ్చి పట్టిన ఆత్మలేనంట. అయితే ఈ ఆత్మలు Scientologists అనే వారిని ఏమీ చేయలేవంట, ఎందుకంటే వాళ్ళందరూ తమతమ శరీరాలనుండి ఈ ఆత్మలను తొలగించేసుకున్నారంట. అంటే మనం రామాయణ మహాభారతాలను నిజంగానే జరిగాయని ఎలా నమ్ముతామో, ఈ Scientologistలు కూడా పైన చెప్పిన ఆ కధను కూడా నిజంగా జరిగిన కధే అని నమ్ముతారు. అంతే కాదండోయ్ అమెరికాలో Scientologyని 1993లోనే ఒక మతంగా గుర్తించేసారు కూడా.

300

వాళ్ళు 300 మందే, కానీ 1000000 మంది శత్రు సైనికులను ఎదుర్కుంటారు. “Lord of the Rings” తరువాత సాంకేతిక పరంగా అంత అత్భుతమైన సినిమా అంటే ఇదే. ట్రెయిలర్స్ చూసిన తరువాత సినిమాలో నిరాశ పరుస్తాడేమో ఉనుకున్నాను. కానీ సినిమా ట్రెయిలర్స్ కంటే కూడా చాలా బాగుంది. “Sin City” సినిమాని నచ్చిందంటే మీకు ఈ సినిమా కూడా నచ్చి తీరాలి. ఈ సినిమాని నిజంగా ఒక కళా కండం అని చెప్పొచ్చు.


ఒకప్పటి గ్రీకులో జరిగిన సంఘటనకు కొంత కల్పన జోడించి ఈ సినిమాను రూపొందించారు. స్పార్టా అనేది ఒక చిన్న గ్రీకు పట్టణం. ఆ పట్టణంలో యువకులు యుద్దంలో మరణం ఒక అందమయిన మరణంగా భావిస్తారు. పుట్టినప్పటి నుండి వారిని యుద్దానికి పనికి వస్తారా-రారా అనే పరీక్షిస్తూ ఉంటారు. అప్పట్లో పెర్శియా ఒక బలమయిన రాజ్యం. అప్పటికే 1000 రాజ్యాలను జయించి గ్రీకు దేశాన్ని కూడా తనలో కలుపుకుందామని ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. ఆ ప్రయత్నంలోనే స్పార్టాను లొంగిపొమ్మని దూతలను పంపుస్తాడు. కానీ స్పార్టా రాజు అయిన లియోనిదాస్ దానికి ఒప్పుకోడు, ఫలితంగా ఈ యుద్దం.

ఈ సినిమాలో చూపించినంత ఎర్రగా, రక్తాన్ని ఇంకో సినిమాలో చూపించలేరేమో. అందుకనే నేను కూడా ఈ జాబును ఎర్రగా రాస్తున్నాను. నిజమయిన యుద్ద వాతావరనాని చూపిస్తారు సినిమాలో. శత్రు సైనికుల శవాలతో కొండనే తయారు చేస్తారు ఆ 300ల మంది. బాణాల వర్షం వళ్ళ ఏర్పడే నీడలో యుద్దం చేస్తారు. తలలు చేతులు కాళ్ళు అన్నీ అలా తెగి పడుతూనే ఉంటాయి. వయలెన్సుకి తాతలాంటిది ఈ సినిమా. ఈ సినిమాలో చూపించినంత హింసను నేను ఇంకో సినిమాలో చూడలేదు. మాంసాన్ని కోస్తున్న శబ్దమే వినపడుతుంది. అంత హింస ఉన్నాకూడా ఈ సినిమా మీద నాకు వ్యతిరేకత రాలేదు, పైగా ఇంకోసారి చూడాలని అనిపిస్తుంది.


ఈ సినిమాలో చాలా బాగాన్ని స్టూడియో లోపలే నీలిరంగు బెక్గ్రవుండ్‌లో తీసి, ఆ తరువాత దానిమీద బోలెడంత గ్రాఫిక్‌వర్క్ చేసారు. అందుకనే మనకు సినిమా చూస్తున్నంత సేపు వేరే లోకాన్ని చూస్తున్న ఒక రకమైన అనుభూతి కలుగుతుంది. అందుకే ఈ సినిమాను తియేటరులోనే చూడండి, DVDల కోసం వేచి చూడొద్దు. చూసినా మీరు హాలులో చూసినప్పుడు పొందే అనుభూతి పొందలేరు. ఈ చిత్రం ఈ యేటి మేటి చిత్రంగా ఆస్కారు అవార్డు పొందినా ఆశ్చర్యం లేదు.

యుట్యూబులో ఈ సినిమా ట్రెయిలరు చూడొచ్చు. ఈ ట్రెయిలరులో పిల్లలకు ఆమోదయూగ్యం కాని సన్నివేశాలు ఉండొచ్చు.

అంతే కాదు ఈ సినిమాకు ఇరానులో అప్పుడే వ్యతిరేకత కూడా మొదలయ్యింది. http://www.youtube.com/watch?v=H41h994hF6I

ఉదకమండలం అందాలు

కొత్త సంవత్సరాన్ని నేను ఉదకమండలంలో జరుపుకున్నాను. ఆలా వెళ్ళినప్పుడు తీసిన ఫొటోలలో ఇవి కొన్ని. మరిన్ని ఫొటోల కోసం ఈ లింకును సందర్శించండి.

నా ఈ బ్లాగును కూడా చదివే వారు ఉన్నారు అని, ఇవా ఒక్క రోజులోనే వచ్చిన నాలుగు వ్యాఖానాలను చూస్తే తెలిసిపోయింది. అందుకనే ఒక బ్లాగు పాఠకుడు వ్యాఖానించినట్లుగా ప్రతీ చిత్రానికి కొంత సమాచారాన్ని చేర్చాను.

ఊటీ దగ్గరలోనే కూనూరు అనే ఇంకో అందమయిన ప్రదేశం ఉంటుంది. అక్కడికి దగ్గరలో ఉన్న ఒక టీ ఫ్యాక్టరీ చూడటానికి వెళ్తున్నప్పుడు మార్గమంతా మనం ఇలాంటి అందమయిన టీ తోటలు చూడవచ్చు.
Scene - 09
అసలు పరిమాణం

ఈ సూర్యోదయం ఫొటో కాదు, సూర్యాస్తమయం ఫొటో. మధ్యానం 4 గంటలకు తీసాను. టీ తోటల మొక్కలతో పాటుగా మధ్యలో ఇలా కొన్ని ప్రత్యేకమయిన చెట్లు కూడా పెంచుతారు. అవి వర్షపునీటిని తమ వేర్లలో దాచుకుని టీ మొక్కలకు అందిస్తూ ఉంటాయంట. కాబట్టే టీ మొక్కలకు ప్రత్యేకంగా నీటి సరఫరాలంటిదేమీ ఉండదు.
Scene - 10
అసలు పరిమాణం

ఏనుగు కాలు చెట్టు (Elephant Leg Tree)… ఈ చెట్టు పేరుకు తగ్గట్లుగానే అచ్చం ఏనుగు కాలులాగానే ఉంటుంది. కూనూరు లోనే సింస్(sims) పార్కులో ఈ చెట్టును మనం చూడవచ్చు. ఫొటోలో కనపడటంలేదుకానీ ఈ చెట్టు చాలా ఎత్తు ఉంటుంది. ఇద్దరు ముగ్గురు పక్క పక్కనే నుంచుంటే ఉండేటంత లావు ఉంటుంది ఈ చెట్టు.
Elephant Leg Tree
అసలు పరిమాణం

మైసూరు నుంది ఊటీ వెల్తున్నప్పుడు కొంతదూరం తరువాత ఘాట్ రోడ్డు ప్రారంభమవుతుంది. మొంత్తం 36 మలుపులు(hairpin curves) ఉంటాయి. వాటిని ఎక్కేసరికి బండి ఇంజిను బాగా వేడెక్కిపోతుంది. అందుకనే బండికి నీళ్ళు తాగించటానికి మధ్యలో ఆపుతూ ఉంటారు. ఆలా ఆగినప్పుడు ఈ చెట్టు కనిపించింది. ఎందుకో తెలీదు కానీ ఈ చెట్టు, దాని వెనుక నీలి ఆకాశం నాకు చాలా బాగా నచ్చింది.
Lonely Tree
అసలు పరిమాణం

ఇది ఊటీ సరస్సు. ఈ సరస్సులో మనం బోటులో షికారు చేయవచ్చు. ఊటీలో ఇది ఒకానొక ప్రధాణాకర్షణ.
Ooty Lake
అసలు పరిమాణం

కూనూరు దగ్గరి టీ తోటల చిత్రాలు ఇంకొన్ని.
Scene - 07
అసలు పరిమాణం

వీటన్నిటినీ నేను మధ్యానం తీసాను. అయినా కూడా మంచు పోలేదు. అసలు అవి మేఘాలేమో… కూనూరు ఊటీ రెండూ ఎత్తయిన కొండల మీద ఉంటాయి కదా…
Scene - 08
అసలు పరిమాణం

సాయంత్రం 4 తరువాత ఇలా కొంచెం ఎండ కాసింది. అప్పటిదాకా ఉన్న చలివల్ల కావచ్చు ఎండ పడేసరికి చాలా హాయిగా అనిపించింది.
Scene - 11
అసలు పరిమాణం

ఫొటోలో సరిగ్గా రాలేదు కానీ, ఇది చాలా పెద్ద లోయ.
Scene - 12
అసలు పరిమాణం

ఇది టీ మొక్క కాదు, అసలు ఈ మొక్కకూ, ఊటీకి సంబందమే లేదు. మైసూరు నుండి ఊటీ వెల్తున్నప్పుడు మధ్యలో బోజనానికి ఆగాము. అక్కడ ఈ గడ్డి మొక్క కనిపిస్తే ఒక ఫొటో తీసాను. ఈ మొక్క పేరు కూడా నాకు తెలియదు.
Some Plants
అసలు పరిమాణం

హోటలు దగ్గర కనిపించిన ఈ పూలను బాగున్నాయని తీసాను కానీ నాకు ఈ పూల పేర్లు తెలీదు. ఊటీ ఉధ్యానవనంలో కూడా ఇవే పూలను ఒక చోట చూసాను.
Flowers
అసలు పరిమాణం

ఊటీ ఎత్తయిన కొండలలో ఉన్న ఒక చిన్న లోయ. ఈ ప్రాంతమంతా కొండలలో చుట్టుముట్టి ఉంటుంది. అలాంటి ఒక కొండపైకెక్కి తీసిన చిత్రమిది. మొత్తం ఊటీ కాకపోయినా, ఏదో కొంత ప్రాంతం వచ్చింది, ఈ ఫొటోలో…
Ooty Hill Top View - 1
అసలు పరిమాణం

ఊటీ వెళ్ళినప్పుడు తప్పకుండా చేయవలసిన పని ఇది. ఊటీ నుండి కూనూరుకు వెళ్ళటానికి ఒక ఒక రైలు బండి ఉంటుంది. ఎప్పుడో బ్రిటీషువాళ్ళ కాలంలో వేసిన పట్టాల మీద, దాదాపు అంతే పాతదయిన రైలు తిరుగుతూ ఉంటుంది. ఇది కేవలం పర్యాటకుల కోసమే తిరిగే రైలు. మెల్లగా ఒక మనిషి పరిగెత్తేటంత వేగంతో వెళ్తూ 20 కిమీల దూరాన్ని 2 గంటలలో తీసుకుని వెళ్తుంది. అలా మెల్లగా తీసుకుని వెళ్ళటం వలన దారిలో ఉన్న ప్రకృతి దృశ్యాలను మనం చాలా బాగా ఆస్వాదించవచ్చు. ఈ రౌలు ప్రయాణంలోనే మేము దాదాపు 100 ఫొటోలు దాకా తీసుకున్నాము. మద్య్హలో రెండు మూడు సొరంగమార్గాలు, ఇరువైపులా అందమయిన లోయలతో ప్రయానిస్తున్నంత సేపు, చాలా మంచి అనుభూతిని పొందవచ్చు.
Ooty-Koonoor Train
అసలు పరిమాణం

అర్ధరాత్రి 3 గంటలకు మైసూరులో ఒక నిర్మానుష్యపు రోడ్డులో తీసిన ఫొటోఇది…
Road Center
అసలు పరిమాణం

మైసూరు నుండి ఊటీకి వెళ్తున్నప్పుడు వచ్చే ఒక మలుపు ఇది.
Scene - 02
అసలు పరిమాణం

నగరాలలో యాంత్రిక జీవితానికి, రణగొణ ద్వనులకు అలవాటు పడిపోయిన వాళ్ళకు ఇలాంటి అందమయిన ప్రదేశంలో ఇలా ఒక ఒంటరి ఇల్లు కనిపిస్తే …
Scene - 03
అసలు పరిమాణం

టీ కాకుండా ఇక్కడ ఇలా వేరే పంటలు కూడా పండిస్తారు మరి.
Scene - 06
అసలు పరిమాణం

ఈ ఫొటో చూసినప్పుడు గుర్తుకు వచ్చింది, ఊటీలో నీటికొరత. అందుకనే అక్కడ నీటిని చాలా జాగ్రత్తగా వాడు కుంటారు.
Stream of Water - 1
అసలు పరిమాణం

Follow

Get every new post delivered to your Inbox.